భువనేశ్వర్: ఈజిప్ట్ దేశానికి చెందిన కార్గో షిప్‌ను (Egyptian Ship) నిర్బంధించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నిర్బంధాన్ని పర్యవేక్షించడానికి స్థానిక కోర్టు సీనియర్ న్యాయమూర్తిని అడ్మిరల్‌గా నియమించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ నౌక అరెస్ట్‌లో ఉంటుందని పోర్ట్ అధికారులు తెలిపారు. ఈజిప్ట్‌కు చెందిన ఎంవీ వాడి అల్బోస్తాన్ ఆగస్ట్ 6న ఒడిశాలోని పారాదీప్ పోర్ట్‌కు చేరుకుంది. అక్కడి నుంచి 55,000 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని చైనాకు రవాణా చేయాల్సి ఉంది.
కాగా, తక్కువ సల్ఫ్యూరిక్ మెరైన్ గ్యాసోయిల్ రవాణాకు సంబంధించి జర్మన్ కంపెనీ ఒడిశా హైకోర్టును ఆశ్రయించింది. తమకు రూ.3.96 కోట్ల రుణం బకాయి ఉన్నందున ఆ ఈజిప్ట్ షిప్‌ను స్వాధీనం చేసుకోవాలని కోర్టును అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో ఆ కార్గో షిప్ పోర్ట్ నుంచి వెళ్లకుండా నిర్బంధించాలని ఆగస్ట్ 14న ఒడిశా హైకోర్టు ఆదేశించింది. ఈ నిర్బంధాన్ని పర్యవేక్షించడానికి స్థానిక కోర్టు సీనియర్ న్యాయమూర్తిని అడ్మిరల్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో కోర్టు తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈజిప్ట్ నౌక అరెస్ట్‌లో ఉంటుందని పోర్ట్ అధికారి తెలిపారు. అయితే గత నాలుగు నెలల్లో పారాదీప్ పోర్టులో మూడు నౌకలు నిర్బంధానికి గురయ్యాయి.