ప్లీనరీ విజయవంతానికి అన్ని ఏర్పాట్లు
మూడు రోజులపాటు ర్యాలీలు, జెండాల ఆవిష్కరణ
సమావేశంలో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి
చర్లపల్లి, ఏప్రిల్ 24 : ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. కాప్రా సర్కిల్ పరిధిలోని ఏఎస్‌రావునగర్ డివిజన్, టీఎస్ఐఐసీ కాలనీలోని లయన్స్ క్లబ్ భవనంలో డివిజన్ అధ్యక్షుడు కాసం మహిపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహిం చిన సన్నాహక సమావేశానికి రాష్ట్ర ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ పావనీమణిపాల్రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో ప్లీనరీని విజయవం తం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, ప్రధాన కూ డళ్లు, కాలనీలు, బస్తీల్లో స్వాగత తోరణాలను ఏర్పాటు చేసేం దుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యంతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పనిచేయాలని, పార్టీకి మచ్చ తీసుకువచ్చే విధంగా కార్యక్రమాలు చేపడితే తగు చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్లీనరీ సందర్భంగా మూడు రోజుల పాటు వివిధ కార్యక్ర మాలు చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ కార్యదర్శి కుమారస్వామి, నాయకులు బేతాల బాల్‌రాజు, కందాడి సుదర్శన్‌రెడ్డి, మురళీపంతులు, కందుల లక్ష్మీనారాయణ, ఏనుగు సీతారామిరెడ్డి, బాల్‌నర్సింహ, మహ్మద్ బాజీబాషా, శ్రీనివాస్‌రెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, యాదగిరి, రాజిరెడ్డి, యాకయ్య, గడ్డం రవికుమార్, మహిళా అధ్యక్షు రాలు శిరీషారెడ్డి, సదాలక్ష్మి, రామతులసీ, మంజుల, సత్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.