Jagadish Reddy | ఏపీ ప్రభుత్వం అక్రమంగా 140 టీఎంసీల నీళ్లను తీసుకొని పోయింది : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
Jagadish Reddy | కమీషన్లకు అలవాటు పడ్డ ఈ ప్రభుత్వం లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇవ్వడం లేదు. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు ఏ విధంగా దోచుకుంటున్నారో వాస్తవాలు ప్రజలకు చూయించిన. రాజశేఖర్ రెడ్డి పెట్టిన పోతిరెడ్డిపాడు బొక్కతో అంతులేకుండా నీళ్లను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకెళ్తుందని ఆరోపించారు.
Jagadish Reddy | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ కలిసి ఆడిన నాటకం ద్రోహం ఇప్పుడు తేట తెల్లం అయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిల్ల, అన్నారం బ్యారేజ్ లపై సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ తో కలిసి ఆడుతున్న నాటకం తెలిసిపోయిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజ్‌తో సంబంధం లేకుండా కన్నేపల్లి పంపు హౌస్ ఆన్ చెయ్యండని కేటీఆర్ అనేక సార్లు చెప్పిన ప్రభుత్వం పట్టించుకోలేదు. చెప్పిన అబద్ధమే చెప్పుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం NDSA సాకు చెప్పింది. కమీషన్లకు అలవాటు పడ్డ ఈ ప్రభుత్వం లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇవ్వడం లేదు. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు ఏ విధంగా దోచుకుంటున్నారో వాస్తవాలు ప్రజలకు చూయించిన. రాజశేఖర్ రెడ్డి పెట్టిన పోతిరెడ్డిపాడు బొక్కతో అంతులేకుండా నీళ్లను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకెళ్తుందని ఆరోపించారు.
పోతిరెడ్డిపాడు నుంచి వరద జలాలను మాత్రమే తీసుకొని పోవాలి. దుర్మార్గంగా 140 TMC ల నీళ్ళను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీళ్లను తీసుకొని పోయిందన్నారు జగదీష్ రెడ్డి . సాగర్ లో ఇప్పటివరకు 175 TMC ల నీళ్ళు ఉన్నాయి…110 TMC ల నీళ్ళు వచ్చి ఉంటే సాగర్ నిండేది. నాగార్జున సాగర్ లో ఎడమ కాల్వ క్రింద ఉండే పంటలకు సరిపడే నీళ్ళు ఉండేవి. నాగార్జున సాగర్ లో 518 అడుగుల నీళ్ళు ఉన్నప్పుడే ఎడమ కాల్వ క్రింద సాగునీరు ఇచ్చాము. సాగర్ లో 510 అడుగుల నీళ్ళు ఉన్నప్పుడే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎడమ కాల్వ క్రింద సాగునీరు ఇచ్చాడు. పెన్నా బేసిన్ లో వరద రాకున్నా రాయలసీమలో 52 శాతం వర్షపాతం తక్కువ ఉన్న మహబూబ్ నగర్ పరిధిలో ఉండే పంపులు ఇంతవరకు ఆన్ చెయ్యలేదు, ఈ ప్రభుత్వం గోదావరి, కృష్ణాలో ద్రోహం చేస్తుంది. నీళ్లు ఇస్తే కరెంట్ కొనాలని పంటలు వేస్తే ఎరువులు ఇవ్వాల్సి వస్తుందని ఈ ప్రభుత్వం నీళ్ళు ఇవ్వడం లేదు. పంట కొంటే బోనస్ ఇవ్వాలి అందుకే ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచనతో నీళ్ళు ఇవ్వడం లేదు.
ఎల్ నినో పేరుతో దుర్మార్గమైన ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది , నీళ్ళు ఇవ్వొద్దని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. తెలంగాణ రైతు పరిస్థితి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఉండే దానికంటే ఎక్కువ అద్వాన్నం అయిపోయింది. రైతులకు ఎల్‌నినో పెట్టిన శాపం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన శాపం. పోలవరం నుంచి పట్టిసీమ నుంచి బ్రహ్మాండంగా నీళ్లు పోతున్నాయి. కన్నేపల్లి పంపులు ఆన్ చేసి ఉంటే మల్లన్నసాగర్, కొండ పోచమ్మ, రంగనాయక సాగర్ నిండేవి. ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పి కన్నేపల్లి పంపులు ఆన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఎల్ నినో ప్రభావం దేశ వ్యాప్తంగా ఉంది.. ఉన్నటువంటి నీళ్లను వాడుకొని రైతులకు నీళ్ళు ఇవ్వొచ్చు కదా…! రైతులకు నీళ్లు ఇస్తే పండిన పంటను చేతగాని రండ ప్రభుత్వం కొనలేకపోయిన రైతులు బయట అమ్ముకుంటారు కదా.. అన్నారు.
LIVE: తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS మీడియా సమావేశంhttps://t.co/5grOGMgSZc
— BRS Party (@BRSparty) August 23, 2026
Read Also :
Mark Carney | అమెరికాతో మేం యుద్ధంలో ఉన్నాం.. కెనడా ప్రధాని సంచలన వ్యాఖ్యలు
Brijbhushan | పతంజలిలో స్వదేశీ పేరుతో కల్తీ ఉత్పత్తుల అమ్మకం.. బాబా రామ్‌దేవ్‌పై బ్రిజ్‌భూషణ్ మళ్లీ విమర్శలు
Yash’s Toxic | యష్ ‘టాక్సిక్’ అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ.. రూ. 27 కోట్లు దాటిన వసూళ్లు!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

