దుండిగల్, మే 30: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని మహిళ కొడుకును కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు ఓ ప్రబుద్ధుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట, శ్రీనివాస నగర్లో నివాసముంటున్న బిలాల్‌కు అదే ప్రాంతానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉంది. మహిళ కొడుకు సయ్యద్ డానిష్ తన వివాహానంతరం కుటుంబంతో కలిసి నగరంలోని బోరబండలో నివాసముంటున్నారు. కాగా బిలాల్ ఇప్పటికీ మహిళతో వివాహేతర సంబ ంధం కొనసాగిస్తుండడంతో డానిష్ తర చూ మందలిస్తు వస్తున్నాడు.
ఈ నేపథ్యంలో డానిష్ ను అడ్డు తొలగించుకునేందుకు బిలాల్ తన మిత్రులతో కలిసి పథకం రచించాడు. డానిష్ సైతం పథకం వేసి గాజులరామారంలోని బతుకమ్మ బండ వద్ద ఉన్న చెరువుగట్టు పై మందు తాగుదాం అంటూ బిలాలను ఆహ్వానించగా, బిలాల్ తన మరో మిత్రుడితో కలిసి వచ్చాడు. మద్యం తాగుతున్న విషయాన్ని కావాలని బయటకు తీసి గొడవపడ్డారు. తమతో తెచ్చుకున్న కత్తితో డానిష్‌ను విచక్షణ రహితంగా పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.