మారేడ్పల్లి, మార్చి 3: పట్టాల పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..డబిల్పూర్-మనోహరాబాద్ రైల్వే స్టేషన్ల మధ్యన మంగళవారం ఉదయం రైల్వే ట్రాక్ పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా రైలు ఢీ కొట్టడంతో తలకు బలమైన గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చూరీకి తరలించారు. మృతుడి కుడి చేతి పై అమ్మ అని పచ్చ బొట్టు ఉందని పోలీసులు తెలిపారు. మృతుడి వయసు సుమారు 20-25 సంవత్సరాలు ఉంటాయని పోలీసులు చెప్పారు. మృతుడి సంబంధీకులు ఏవరైనా ఉంటే సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్లో సంప్రదించాలని కోరారు.