పెద్దఅంబర్‌పేట, సెప్టెంబర్ 16 : ఐరన్ లోడ్‌తో వెళ్తున్న లారీ(Iron load lorry) బోల్తా పడి డ్రైవర్ అక్కడి కక్కడే మృతి (Driver died) చెందాడు. ఈ ఘటన పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలోని తారామతిపేట పరిధిలో ఓఆర్ఆర్పై(ORR) సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని సత్యసాయి అనంతపురం జిల్లా హిందూపూర్ మోడల్ కాలనీకి చెందిన డ్రైవర్ రాజగోపాల్‌చారి (28) ఐరన్ లోడు లారీతో రాయిపూర్ నుంచి బెంగళూరుకు ఓఆర్ఆర్పై వెళ్తున్నాడు.
తెల్లవారుజామున తారామతిపేట వద్ద ఓఆర్ఆర్ 10వ ఎగ్జిట్ సమీపంలో టోల్గేట్ దాటగానే లారీ అదుపుతప్పి ఓఆర్ఆర్ పైనుంచి కింద సర్వీస్ రోడ్డుపై బోల్తాపడింది. డ్రైవర్ రాజగోపాల్‌చారి లారీ క్యాబిన్లో ఇరుక్కు పోయి అక్కడికక్కడే మృతిచెందాడు. క్లీనర్ బాబాజాన్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడ్డ బాబాజాన్‌ను దవాఖానకు తరలించారు. క్యాబిన్లో ఇరుక్కు పోయిన రాజగోపాల్‌చారి మృతదేహాన్ని గ్యాస్ కట్టర్ సాయంతో వెలికితీశారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట.. రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతారా: కేటీఆర్