జూబ్లీహిల్స్, అక్టోబర్ 28 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు సిద్ధమయ్యాయి. మొత్తంలో 59మంది అభ్యర్థులు బరిలో ఉండగా 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో సెంటర్లో ఒక కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్‌తో పాటు అభ్యర్థుల సంఖ్యను బట్టి బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటుచేయాల్సి ఉంటుంది.
ఒక బీయూలో 16మంది అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉండడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీచేస్తున్న అభ్యర్థులను బట్టి ఈవీఎంలు సిద్ధం చేస్తున్నారు. దీంతో ఒక పోలింగ్ కేంద్రంలో నోటాతో పాటు 59మంది అభ్యర్ధులు ఉండేలా 4 బ్యాలెట్ యూ నిట్లు ఏర్పాటుచేస్తున్నారు.
మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు రిజిస్టర్ట్ పొలిటికల్ పార్టీల నుంచి 26మంది.. స్వతంత్ర అభ్యర్థులుగా 29మంది బరిలో ఉన్నారు. ఇప్పటికే ఈవీఎంలను యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో భద్రపరిచారు. జూబ్లీహిల్స్‌లో ఇంతమంది అభ్యర్థులు పోటీచేయడం ఇదే తొలిసారి.