KK Commission | కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు అధికారంలోకి వచ్చిన వెంటనే 250 గజాలు ఇంటి స్థలం ఇస్తాం.. నెలకు 25 వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇస్తాం.. ఐడి కార్డులు ఇచ్చి బస్సు ప్రయాణం ఫ్రీగా కల్పిస్తామని అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచిపోతున్నాఏ ఒక్కరికి కూడా ఎలాంటి హామీ నెరవేర్చని ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో చీల్చి చెండాడుతామని అడ్వకేట్ జేఏసీ నేత, మాజీ బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర హెచ్చరించారు.
ఉద్యమకారులు జైలుకు పోయి అరెస్టులై ఉద్యమంలో గాయపడి ఆసుపత్రుల పాలై అకాడమిక్ ఇయర్లు కోల్పోయిన విద్యార్థులు, భవిష్యత్తును కోల్పోయిన న్యాయవాదులు, ఉద్యోగస్తులు, జర్నలిస్టులు కుల ప్రజా సంఘాల నేతలు ఎంతోమంది పోరాటం చేసి సాధించిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు మాయమాటలతో అధికారంలోకి వచ్చి కేకే కమిటీ పేరుతో (కాంగ్రెస్ చీటింగ్ కమిటీ) కాలయాపన చేస్తూ జీవో 679 విడుదల చేసి ఉద్యమకారులను మరొకసారి మోసం చేయడానికి నాటకం మారుతున్నదని.. ఇలాంటి నాటకాలు ఉద్యమకారుల ముందు సాగవని హెచ్చరిక చేశారు.
కేకే కమిటీ ఎన్ని రోజుల్లో రిపోర్ట్ ఇస్తుందని.. ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వం అమలు చేయకపోతే ఉద్యమకారుల పరిస్థితి ఏమిటని ఆయన అన్నారు. కమిటీని వేయటానికి 30 నెలలు సమయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కమిటీ రిపోర్ట్ ఇస్తే దాన్ని అమలు చేయటానికి ఎంత సమయం తీసుకుంటుందో అంతుచిక్కదని కేవలం ఉద్యమకారులను మోసం చేయడానికి ఈ కుట్ర అని ఉపేంద్ర అన్నారు.
ఉద్యమకారుల త్యాగాలు లేనిదే ఈ రోజు ఈ నాయకులకి ముఖ్యమంత్రి పదవి మంత్రి పదవులు, ఇతర పదవులు వచ్చేవి కాదని వెంటనే ఈ ప్రభుత్వం ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించి అమరుల కుటుంబాలకు కోటి రూపాయలు, ఉద్యమంలో గాయపడ్డ వారికి కోటి రూపాయలు, జైలు జీవితం గడిపిన వారికి ఆర్దిక సాయంతోపాటు 250 గజాలు స్థలం, పెన్షన్ 25 వేల రూపాయలు ఇచ్చి ఐడీ కార్డును ఇచ్చి బస్సు ప్రయాణంలో ఉచిత సౌకర్యం కల్పించి.. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో వీరిని గౌరవిస్తూనే వీరికి ప్రవేశం కల్పించాలని ఉపేంద్ర డిమాండ్ చేశారు.
Priyanka Mohan | ‘మేడ్ ఇన్ కొరియా’ సక్సెస్ ఎఫెక్ట్.. కొరియా టూరిజం అంబాసిడర్గా ప్రియాంకా మోహన్!
Pawan kalyan | పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరించిన హైకోర్టు