HMWSSB | సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ పరిధిలో పలు ప్రాంతాల్లో సోమవారం నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ మేరకు అధికారులు ముందస్తుగా ప్రకటన విడుదల చేశారు. నగరానికి తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేస్-1లోని కొండపాక పంపింగ్ స్టేషన్ వద్దనున్న 3000 ఎంఎం డయా, ఎంఎస్ పంపింగ్ మెయిన్‌కు 900 ఎంఎం డయా వాల్వ్‌లు అమర్చనున్నట్లు పేర్కొన్నారు.
ఈ క్రమంలో సోమవారం ఉదయం 6గంటల నుంచి మరుసటి రోజు మంగళవారం ఉదయం 6గంటల వరకు పనులు జరగనున్న నేపథ్యంలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. ఎస్ఆర్నగర్, సనత్‌నగర్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, వెంగళ్రావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, ఫతేనగర్.
కూకట్పల్లి, భాగ్యనగర్, వివేకానంద నగర్, ఎల్లమ్మబండ, మూసాపేట్, భరత్‌నగర్, మోతీనగర్, గాయత్రీనగర్, బాబానగర్, కేపీహెచ్‌బీ, బాలాజీ నగర్, హస్మత్‌పేట్, హఫీజ్‌పేట్, మియాపూర్, కొంపల్లి, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, జవహర్‌నగర్, దమ్మాయిగూడ, నాగారం, డివిజన్-22లోని నిజాంపేట, బాచుపల్లి, ప్రగతినగర్, గండి మైసమ్మ, తెల్లాపూర్, బొల్లారం, , త్రిశూల్ వైన్స్, గన్‌రాక్, హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, బీబీనగర్ ఎయిమ్స్, ఆర్డబ్ల్యూఎస్ ఆఫ్ టేక్స్ ప్రాంతాలైన ప్రజ్ఞాపూర్(గజ్వేల్), ఆలేర్(భువనగిరి), ఘన్పూర్(మేడ్చల్/శామీర్‌పేట) తదితర ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని, ప్రజలు నీటిని పొదునుగా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.