Crime News | కుత్బుల్లాపూర్,జనవరి 27: తన లైంగిక కోరికను తీర్చుకున్నాక డబ్బులు అడిగిన మహిళను బండరాయితో తలపై బాది..ఆపై పొట్రోల్ పోసి తగులపెట్టి పరారయ్యాడు. సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. సోమవారం పేట్ బషీరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి వివరాలను వెల్లడించారు. ఈ నెల 24న మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మునీరాబాద్ గ్రామం ఓఆర్ఆర్ కల్వర్టు సమీపంలో రెండు చేతులపై ఆభరణాలు, పచ్చబొట్టు గుర్తులతో ఉన్న మహిళ హత్యకు గురికాగా.. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
మృతురాలి చేతిపై ఉన్న ఆభరణాలు…పచ్చబొట్టు పేర్లతో పాటు ఇతర ఆనవాళ్లు సేకరించి ఆచూకి కోసం ఆయా పోలీస్స్టేషన్లకు పంపించారు. దీంతో మృతురాలు నిజామాబాద్ జిల్లా బోధన్ శెట్టిపేట్కు చెందిన ఇరుగడిండ్ల శివానంద(45)గా తేలింది. వెంటనే బాధిత కుటుంబాన్ని విచారించగా.. ఆమె.. భర్త సాయిలుతో గొడవ పడి నగరానికి వలస వచ్చి ఈసీఎల్, కొంపల్లి ప్రాంతంలో ఉంటూ రోజువారి కూలీ పనులు చేసుకుంటుందని తేలింది.
కాగా.. కరీంనగర్ జిల్లా కమలాపురం ప్రాంతానికి చెంది న షేక్ ఇమ్మామ్ శామీర్‌పేట్‌లోని మజీద్పూర్లో ఉంటూ డేవిడ్ స్టోన్ కటింగ్‌లో పని చేస్తున్నాడు. ఈ నెల 23న బండలు కటింగ్ చేసే బ్లేడ్లు కొనుగోలు చేసేందుకు మేడ్చల్‌కు వచ్చాడు.అదే సమయంలో బస్టాండ్ సమీపంలో శివానందతో పరిచయం ఏర్పడింది. తన లైంగిక కోరికను తీర్చేందుకు రూ.500 ఇచ్చి.. ఆమెను బైక్‌పై ఎక్కించుకొని మునీరాబాద్ ఓఆర్ఆర్ కాజ్వే కింద నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లాడు. లైంగిక కోరిక తీర్చుకున్నాక మృతురాలు మరో రూ.500 ఇవ్వాలని అడుగగా.. ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
దీంతో ఆవేశంతో షేక్ ఇమ్మామ్ ..సదరు మహిళను బండరాయితో తలపై కొట్టి.. తన బైక్నుంచి పెట్రోల్ తీసి నిప్పంటించి పరారయ్యాడు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని సోమవారం పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో మేడ్చల్ అడిషనల్ ఏసీపీ పురుషోత్తం, ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్హెచ్ఓ సత్యనారాయణ, డీఐ సుధీర్‌కృష్ణ, దుండిగల్ సీఐ సతీశ్, జీనోమ్‌వ్యాలీ సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్ఓటీ సీఐ శ్యామ్ సుందర్‌రెడ్డి, మేడ్చల్ ఎస్ఐలు మన్మధరావు, అశోక్‌తో పాటు సీసీఎస్ మేడ్చల్, బాలానగర్ టీంలు ఉన్నాయి.