మహేశ్వరం, జూలై 26 : బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం హర్షగూడ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ రవినాయక్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ సాలీ లక్ష్మణ్‌నాయక్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన దాదాపు 200 మంది కార్యకర్తలు, నాయకులు వి ద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్ట్రంలో కులమతాలకతీతంగా సుపరిపాలన జరుగుతుందని ఆమె తెలిపారు. బీఆర్ఎస్తోనే తెలంగాణకు మంచి భవిష్యత్ ఉందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, ఎంపీటీసీ విజయ్ కుమార్, గ్రామ శాఖ అద్యక్షుడు యాదయ్య, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, ప్రధాన కార్యదర్శి జే. రాజునాయక్, నియోజక వర్గం ఎస్టీ సెల్ అధ్యక్షుడు లచ్చానాయక్, తుక్కుగూడ మున్సిపాలిటీ కౌన్సిలర్ బాదావత్ రవినాయక్, యూత్ అధ్యక్షుడు సామ్యూల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్‌లో..
మేడ్చల్, జూలై 26 : మేడ్చల్ మున్సిపాలిటీ 8వ వార్డుకు చెందిన వివిధ పార్టీల నాయకులు బుధవారం మంత్రి చామకూర మల్లారెడ్డి సమక్షంలో బోయినిపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో దండు రమేశ్, సుశీల్‌కుమార్, నవీన్‌కుమార్, సాయికుమార్, సుధాకర్, నర్సింగరావు, శివప్రసాద్, ప్రణయ్‌కుమార్‌తో పాటు దాదాపు 50 మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, నాయకులు మర్రి నర్సింహ రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
చర్లపల్లి డివిజన్లో
చర్లపల్లి, జూలై 26 : చర్లపల్లి డివిజన్ ఇందిరా గృహకల్ప కాలనీ, లక్ష్మీనగర్, డీసీ కాలనీలకు చెందిన టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన శ్యామ్‌ప్రసాద్, బెల్లి పరశురాం, పన్నీరు మహేశ్, తదితర 60 మంది కార్యకర్తలు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి సమక్షంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాలు, బాల్‌రెడ్డి, కనకరాజుగౌడ్, ప్రభుగౌడ్, వెంకట్‌రెడ్డి, నజీర్, సత్తెమ్మ, లలిత, నారెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, శ్రీకాంత్‌యాదవ్ పాల్గొన్నారు.