Hyderabad | హైదరాబాద్ : నాచారం పోలీసు స్టేషన్ పరిధిలోని మల్లాపూర్లో ఘోరం జరిగింది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కోసం ఓ ముగ్గురు యువకులు యాక్టివాపై వచ్చారు. యాక్టివాలో పెట్రోల్ పోస్తుండగా, అందులో ఒకరు నిప్పంటించారు. దీంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో బంక్లో ఉన్న వాహనదారులు, సిబ్బంది పరుగులు పెట్టారు. ఓ వ్యక్తి అప్రమత్తమై మంటలను ఆర్పేశారు.
అయితే యువకులను పెట్రోల్ బంక్ సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. యువకులు గంజాయి మత్తులో ఉన్నట్లు సమాచారం. ఆ మత్తులోనే తన జేబులో ఉన్న లైటర్ తీసి నిప్పంటించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోస్తుండగా నిప్పు పెట్టిన ఆకతాయిలు..
గంజాయి మత్తులో ఉన్న యువకులు..
హైదరాబాద్ – నాచారం పీఎస్ పరిధిలో మల్లాపూర్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోస్తుండగా నిప్పు పెట్టిన ఆకతాయిలు.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు
వెంటనే మంటలను ఆర్పిన పెట్రోల్ బంక్… pic.twitter.com/IVmrhJPfdy
— Telugu Scribe (@TeluguScribe) October 26, 2024
ఇవి కూడా చదవండి..
KTR | సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం.. రైతు మహేందర్ రెడ్డి పాలిట శాపమైంది : కేటీఆర్
KTR | సీఎం ఇలాకా నుంచే తిరుగుబాటు.. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ప్రజల ప్రత్యర్థి కాంగ్రెస్సే : కేటీఆర్