Murder | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వ్యవసాయ వర్సిటీ సమీపంలో బెంగుళూర్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో యువకుడి మృతదేహం లభ్యమైంది. రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడి మృతదేహాన్ని చూసి మార్నింగ్ వాకర్స్ షాకయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతి కిరాతకంగా కత్తితో గొంతుకోసి హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. అయితే ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసినట్లుగా పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు. క్లూస్ టీ సాయంతో ఆధారాలను సేకరించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ మార్గంలో సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
వరుస హత్యాలతో స్థానికులు బెంబేలెత్తుతున్నారు. గత వారం క్రితం రాజేంద్రనగర్ పరిధిలోని కిస్మాత్పూర్ బ్రిడ్జి కింద మహిళను అత్యాచారం చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. నిన్న మైలార్ దేవుపల్లిలో ఓ వ్యక్తిని హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ యత్నించింది.