హైదరాబాద్ : చైనా మాంజ(China manja) తగిలి ఓ యువకుడు గాయపడ్డాడు. గొంతుకు గాయమవడంతో 22 కుట్లు పడ్డాయి. వివరాల్లోకి వెళ్తే..పాతబస్తీ నవాబ్ సాబ్ కుంటకు చెందిన జమీల్ అనే యువకుడు తన బైకుపై చార్మినార్ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో షంషీర్ గంజ్ వద్ద గొంతుకు మాంజ తగలడంతో జమీల్ గాయపడటంతో ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
కాగా, చైనా మాంజ(Chinese manja) పట్టిస్తే రూ.5 వేలు గిఫ్ట్ ఇస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్( MLA Danam Nagender)ప్రకటించారు. చైనా మాంజ కారణంగా మనుషులతో పాటు పక్షులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయని దానం అన్నారు. ముఖ్యంగా మెడ, ముఖం, చేతులకు ప్రాణాంతక గాయాలు సంభవిస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా పక్షులు, విద్యుత్ తీగలు, ప్రజా ఆస్తులకు కూడా భారీ నష్టం జరుగుతోందన్నారు.