చర్లపల్లి, ఆక్టోబర్ 15 : విద్యుత్‌షాక్‌కు(Electric shock) గురైన ఓ వ్యక్తి మృతి(Young man died) చెందిన సంఘటన చర్లపల్లి(Charlapally) పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా ఘన్‌పూర్‌కు చెందిన శివనాయక్(23)ఉప్పల్‌లో నివాసముంటూ చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఫేజ్2లో ఉండే బయోపల్స్లో ఎలక్ట్రీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, పరిశ్రమలోని గోడకు డ్రిల్ చేస్తుండగా విద్యుత్ వైర్లు తెగిపొవడంతో శివనాయక్ షాక్‌కు గురై కిందపడిపొయాడు.
దీంతో కార్మికులు గమనించి వెంటనే మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శివనాయక్ మృతితో ఘన్‌పూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
TG Rain Alert | అల్పపీడనం ప్రభావంతో.. తెలంగాణలో నాలుగు రోజుల వానగండం..!
Jagga Reddy | రాష్ట్ర పక్షి పాలపిట్టను బంధించిన జగ్గారెడ్డి.. వన్యప్రాణి సంరక్షకులు ఫైర్
MLA Rakesh Reddy | హిందువులు పిచ్చోళ్లు.. బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు