హైదరాబాద్ : ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై( Construction building) నుంచి పడి ఓ యువకుడు మృతి(Man died )చెందాడు. ఈ విషాదకర సంఘటన నల్లగండల్లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిర్మాణంలో ఉన్న ఓ భవనంపై నుంచి పడి రమేష్ సింగ్(40) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.