హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో(Rangareddy Dist) విషాదం చోటు చేసుకుంది. రైలు(Train) కిందపడి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఈ విషాదకర సంఘటన సంఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ(Nandigama) పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నందిగామ మండల కేంద్రానికి చెందిన ఖాజా (23) అనే యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య( Committed suicide) చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఖాజా మృతితో నందిగామలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సింది.
Also Read..
Earthquake | కశ్మీర్ లోయను వణికించిన భూకంపం.. నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు కంపించిన భూమి
KTR | మేఘాపై సీఎం రేవంత్ ప్రత్యేక ఔదార్యం.. ఈ బంధం వెనక మతలబు ఏంటో?: కేటీఆర్
Rain | గద్వాల జిల్లాలో భారీ వర్షం.. అయిజ నుంచి ఏపీకి నిలిచిన రాకపోకలు