Suicide | హైదరాబాద్ : అనుమానాస్పదస్థితిలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రాజేంద్ర నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. హైదర్గూడ ప్రాంతానికి చెందిన రమేశ్ కుమార్తె ఇషిక(29) ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి అక్కడే ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. అయితే ఈ ఏడాది జూన్ చివరి వారంలో ఆమె హైదరాబాద్ నగరానికి చేరుకుంది. వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేస్తుంది.
అయితే బుధవారం మధ్యాహ్నం ఇషిక తన గదిలో నుంచి బయటకు రాలేదు. దీంతో అప్రమత్తమైన తల్లి రాత్రి 7 గంటల సమయంలో బెడ్ రూమ్ వద్దకు వెళ్లి చూడగా, ఉరేసుకుని కనిపించింది. తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.