Murder | హైదరాబాద్ : కూకట్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికంగా ఉన్న స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో రేణు అగర్వాల్(50) అనే మహిళ నివసిస్తోంది. ఆమె చేతులు, కాళ్లు కట్టేసి.. కుక్కర్‌తో మోదీ చంపేశారు. సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డెడ్ బాడీ పక్కనే ప్రెజర్ కుక్కర్ పడింది. ప్రెజర్ కుక్కర్‌తో తలపై మోదీ.. కత్తులతో పొడిచి చంపిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఇంట్లో పని చేసే ఇద్దరు బీహార్ యువకులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రేణు అగర్వాల్‌ను చంపి, నగలు, నగదుతో వారిద్దరూ బైక్‌పై పరారైనట్లు సమాచారం. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.