హైదరాబాద్ : హైదరాబాద్‌లోని రామంతపూర్‌లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. యాక్టివాపై వెళ్తున్న ఇద్దరు దంపతులను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దంపతులు ప్రయాణిస్తున్న యాక్టివా నంబర్ – TS 08 HH 0380.
అయితే ఆర్టీసీ బస్సు వెనుకాల ఓ లారీ వేగంగా వచ్చింది. బస్సును ఓవర్ టేక్ చేయబోయి.. దంపతులు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో మహిళ తలపై నుంచి లారీ వెనుక టైర్లు దూసుకెళ్లాయి. ఈ క్రమంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
హైదరాబాద్ రామంతపూర్‌లో వేగంగా వచ్చిన లారీ.. బైక్‌పై వెళ్తున్న దంపతులను ఢీకొట్టింది. భార్య మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. pic.twitter.com/jjqJTcNqI0
— Namasthe Telangana (@ntdailyonline) April 8, 2022