హైదరాబాద్ : రైలు(Train) కింద పడి ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్(Traffic constable) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన ఘట్కేసర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..నర్సింహరాజు అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ పీసీ 9782 (2009 బ్యాచ్) నగరంలోని ట్రాఫిక్ పీఎస్ గోపాలపురంలో పనిచేస్తున్నాడు. కాగా, నర్సింహరాజు ఘట్కేసర్లోని ఫోల్ నెంబర్ 216 వద్ద రైలు కిందపడి ఆత్మహత్యకు (Committed suicide) పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థాలానికి చేరుకున్నారు.
సంఘటన స్థలంలో నర్సింహరాజు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కుటుంబ సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నర్సింహరాజు మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఇవి కూడా చదవండి..
KTR | తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీపై కేటీఆర్ ప్రశంసల వర్షం
Mowgli | ‘కలర్ ఫొటో’ దర్శకుడితో సుమ కొడుకు కొత్త సినిమా.. ఫస్ట్ లుక్ రిలీజ్
Game Changer | మెగా ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్.. ‘గేమ్‌ఛేంజర్’ నుంచి సెకండ్ సింగిల్