జవహర్నగర్, ఏప్రిల్ 11: కారు వేగంగా దూసుకొచ్చి విద్యార్థులను ఢీకొట్టగా ఓ విద్యార్థిని మృతిచెందగా, మరో విద్యార్థికి గాయాలయ్యాయి. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జవహర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారాం కథనం ప్రకారం… జవహర్నగర్ కార్పొరేషన్లోని ఫైరింగ్కట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో షేక్ అమినీ (14) 8వ తరగతి చదువుతోంది.
స్కూలు నుంచి నడుచుకుంటూ ముగ్గురు విద్యార్థులు ఇంటికి వచ్చే క్రమంలో మార్కెట్గల్లీ సమిపంలోకి రాగానే వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన విద్యార్థులను వెంటనే దవాఖానకు తరలించారు. షేక్ అమినీ చికిత్స పొందు తూ మృతి చెందగా, మరో ఇద్దరు విద్యార్థులకు గాయలయ్యాయి. ఈ మేరకు తండ్రి మునీరుద్ధీన్ ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.