Hyderabad | హైదరాబాద్ : హయత్‌నగర్‌లో విషాదం నెలకొంది. స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు పాఠశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు.
ప్రయివేటు పాఠశాల ఆవరణలోని హాస్టల్ గదిలో విద్యార్థి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. అయితే గది తలుపులు ఎంతకీ తీయకపోవడంతో తోటి విద్యార్థులకు అనుమానం వచ్చి హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు, హాస్టల్ సిబ్బంది కలిసి తలుపులు విరగ్గొట్టి చూడగా, విద్యార్థి ఫ్యాన్‌కు వేలాడుతున్న దృశ్యం కనిపించింది.
అయితే విద్యార్థి మానసిక ఒత్తిడికి గురై, ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. డెడ్‌బాడీని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
BRS | సీఎం రేవంత్‌కు జ్ఞానోదయం కల్పించాలి.. అంబేద్కర్ విగ్రహాలకు బీఆర్ఎస్ వినతి పత్రాలు.. ఫొటోలు
Harish Rao | ఉచిత విద్యుత్‌పై భట్టి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం : హరీశ్‌రావు
Harish Rao | ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 1,27,208 కోట్లు : హరీశ్‌రావు