ముంబై, మార్చి 18 : డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ విభాగంలోకి అడుగుపెట్టింది అమర రాజా గ్రూపునకు చెందిన అమర రాజా డిజైన్ ఆల్ఫా(ఏఆర్‌డీఏ). క్షిపణుల-కీలక డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న అవకాశాలు అందిపుచ్చుకోవడానికి నౌకాదళ సోనార్ సిస్టమ్ కోసం పవర్ కండిషనింగ్ క్యాబినెట్‌ను అభివృద్ధి చేస్తున్నది.
విద్యుత్ యాంప్లీఫైర్స్, సిగ్నల్ ఇంటర్ఫేసెస్, పవర్ యాంప్లీఫైర్స్ క్యాబినెట్స్ను తయారు చేయబోతున్నది. నౌకాదళ విభాగానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని 2020-21లో రూ.49 వేల కోట్లు కేటాయించగా, 2025-26 నాటికి రూ.1.03 లక్షల కోట్లు కేటాయించింది.