హైదరాబాద్, మార్చి 18 : ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ ఏపిస్ ఇండియా.. మార్కెట్లోకి వినూత్నంగా మూడు రకాల మసాలా డేట్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా అతిపెద్ద రిటైల్ షాప్స్, ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌ల్లో ఈ ఉత్పత్తులు లభించనున్నాయి. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ అమిత్ ఆనంద్ మాట్లాడుతూ..వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా నూతన స్నాక్స్ విభాగంలో అడుగుపెట్టినట్టు, తద్వారా కస్టమర్లకు మరింత చేరువకావడానికి వీలుపడనున్నదన్నారు.
వీటిని ఉత్పత్తి చేయడానికి రూ.1.50 కోట్ల పెట్టుబడితో ప్రత్యేక యూనిట్‌ను నెలకొల్పినట్టు, ఈ యూనిట్ సామర్థ్యం 84 మెట్రిక్ టన్నులని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో స్నాక్స్ మార్కెట్ రూ.5 లక్షల కోట్ల స్థాయిలో ఉండగా, దీంట్లో సంఘటిత రంగం కేవలం రూ.80 వేల కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు.