Pending cases | భారీగా వేకెన్సీలు.. గుట్టలుగా పెండింగ్ కేసులు!
దేశవ్యాప్తంగా ఐదు లక్షలకు పైగా భారీ ఖాళీలు.. పెండింగ్లో వేలాది కేసులు.. దేశంలో వినియోగదారుల వివాదాల పరిష్కార వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తున్నది.
న్యూఢిల్లీ, మార్చి 18: దేశవ్యాప్తంగా ఐదు లక్షలకు పైగా భారీ ఖాళీలు.. పెండింగ్లో వేలాది కేసులు.. దేశంలో వినియోగదారుల వివాదాల పరిష్కార వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తున్నది. వినియోగదారుల విశ్వాసాన్ని ఈ వ్యవస్థ రోజురోజుకూ కోల్పోతున్నది. దేశ వ్యాప్తంగా ఉన్న వినియోగదారుల న్యాయస్థానాల పనితీరును 2021-25 మధ్య పరిశీలించి తొలిసారిగా విడుదల చేసిన ఒక నివేదికలో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. రాష్ట్ర వినియోగదారులు వివాదాల పరిష్కార కమిషన్ (ఎస్సీడీఆర్సీ)లలో సగానికి పైగా అధ్యక్ష, సభ్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ (ఐజేఆర్)వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం 2020-2024 మధ్య పెండింగ్ కేసుల సంఖ్య 87,545 నుంచి 5.15 లక్షలకు పెరిగాయి. వినియోగదారుల రక్షణ చట్టం 3-5 నెలల వ్యవధిలో వీలైనంత త్వరగా కేసులను పరిష్కరించాలని ఆదేశించినప్పటికీ మూడింట ఒక వంతు కంటే ఎక్కువ కేసులు మూడు సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నాయి. ఇక కేరళ, జమ్ము కశ్మీర్, జార్ఖండ్లో ప్రతి మూడు కేసుల్లో రెండు కన్నా ఎక్కువ (70-80 శాతం) మూడేండ్ల కన్నా ఎక్కువ కాలం పెండింగ్లో ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- IJR
- nationwide
- pending cases
- SCDRC
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

