వేధిస్తున్న ఐఏఎస్ అధికారుల కొరత.. దేశంలో ఐదో వంతు పోస్టులు ఖాళీ
దేశంలో ఐఏఎస్ అధికారుల కొరత వేధిస్తున్నది. మంజూరైన పోస్టుల్లో ఐదోవంతు భర్తీ కాకుండా ఖాళీగానే ఉంటున్నాయి. ఢిల్లీలో సైతం 25 శాతానికి పైగా ఐఏఎస్ అధికారుల పోస్టులు భర్తీ కాలేదు.
న్యూఢిల్లీ, మార్చి 18: దేశంలో ఐఏఎస్ అధికారుల కొరత వేధిస్తున్నది. మంజూరైన పోస్టుల్లో ఐదోవంతు భర్తీ కాకుండా ఖాళీగానే ఉంటున్నాయి. ఢిల్లీలో సైతం 25 శాతానికి పైగా ఐఏఎస్ అధికారుల పోస్టులు భర్తీ కాలేదు. ఆయ రాష్ర్టాల్లో ప్రభుత్వ పాలన, విధాన నిర్ణయాల అమలు, సంక్షేమ పథకాల అమలు కుంటు పడి మొత్తం పాలనా తీరుపైనే ప్రభావం పడుతున్నది. దీంతో అధికారులపై అదనపు భారం పడుతున్నది.
రాష్ర్టాలకు మంజూరైన ఐఏఎస్ పోస్టులకు, భర్తీ అయిన పోస్టులకు మధ్య వ్యత్యాసాన్ని ఇటీవల పార్లమెంట్ కమిటీ ఒకటి ప్రధానంగా ప్రస్తావించింది. మొత్తం 6,877 పోస్టులు ఉండగా, ప్రస్తుతం 5,577 మంది అధికారులు మాత్రమే సర్వీసులో ఉన్నారు. సుమారు 1300 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం పోస్టుల సంఖ్యలో ఇది 18.9 శాతం. నాగాలాండ్లో 43.62 శాతం, కేరళలో 32.03 శాతం, మణిపూర్లో 30.43 శాతం, త్రిపురలో 27.45 శాతం, ఒడిశాలో 25.40 శాతం, సిక్కింలో 25 శాతం ఐఏఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

