సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ఫేస్బుక్ బ్రౌజింగ్ చేస్తూ స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన ఓ ప్రకటన చూసిన ఓ ప్రైవేట్ ఉద్యోగి సైబర్‌నేరగాళ్ల చేతిలో చిక్కాడు.. రూ. 1,11,23,700 పోగొట్టుకున్నాడు. సైబర్‌నేరగాళ్లు పేరున్న బ్యాంకులు, సంస్థలకు సంబంధించిన సెక్యూరిటీస్ ట్రేడింగ్ ఫ్లాట్ ఫామ్‌లో స్టాక్ ట్రేడింగ్ చేస్తే భారీ లాభాలొస్తాయంటూ ఉప్పల్‌కు చెందిన బాధితుడిని నమ్మించారు. వివిధ రకాలుగా మొత్తం రూ. 1,11, 28,700 వసూలు చేశారు. అందులో కేవలం రూ. 5 వేలు మాత్రమే మొదట లాభంగా వచ్చింది. స్క్రీన్‌పై కన్పిస్తున్న డబ్బు విత్ డ్రా చేసుకోవాలంటూ నిబంధనలు పెడుతుండటంతో మోసాన్ని గ్రహించిన బాధితుడు మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.