హైదరాబాద్ : జవహర్ నగర్(Jawaharnagar) డంపింగ్ యార్డ్ సమీపంలో ఘోర రోడ్డు(Road accident) ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి స్కూటీ పై వెళ్తుండగా రోడ్డు పై ఏర్పడిన నీటి గుంటలను తప్పించపోయి కింద పడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం(DCM) స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిమ్మాయిపల్లి మాజీ ఎంపీటీసీ భర్త అమరేందర్(55) అక్కడికక్కడే మృతి(Man died) చెందాడు.
కాగా, రోడ్డు సరిగా లేక పోవడంతో పాటు డంపింగ్ యార్డు నుంచి వస్తున్న నీళ్ల కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ అమరేందర్ కుటుంబ సభ్యులు మృత దేహంతో డంపింగ్ యార్డు వద్ద ఆందోళనకు దిగారు. డంపింగ్ యార్డు అద్దాలను ధ్వసం చేశారు. తహసీల్దార్ సుచరితను మృతుడి కుటుంబ సభ్యులు నిలదీశారు. కలెక్టర్, మేయర్ స్పందించకపోతే మృతదేహాన్ని తరలించబోమని వెల్లడించారు. మృతుడి బంధువుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
KTR | మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం.. రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
KTR | సీఎం రేవంత్ రెడ్డి విధ్వంసక పరిపాలనకు ధన్యవాదాలు.. కేటీఆర్ ఎద్దేవా
KTR | ఓట్లేయలేదనే కూల్చివేతలు.. బీఆర్ఎస్ కన్స్ట్రక్షన్ చేస్తే రేవంత్‌రెడ్డిది డిస్ట్రక్షన్