హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షంతో హైదరాబాద్ తడిసి ముద్దయింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా మంగళవారం తెల్లవారు జాము నుంచి ఉదయం 7 గంటలకు వరకు హైదరాబాద్ వ్యాప్తంగా వాన దంచికొట్టింది. కాగా, భారీ వర్షానికి విజయ్ (43) అనే రోజువారి కూలీ రాంనగర్లోని(Ramnagar) బాప్టిస్ట్ చర్చి వద్ద వరదలో(Flood) కొట్టుకుపోయి మృతి(Person died) చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షం కారణంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఈవోలు ఆదేశాలు జారీచేశారు. కాగా, పంజాగుట్టలోని అపార్టుమెంట్ సుఖ్ నివాస్ అపార్టుమెంటు వద్ద పిడుగుపడింది (Lightning). షెడ్డుపై పిడుగు పడి కారు ధ్వంసమయింది. దీంతోపాటు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రజలు అవసరమైతేనే తప్ప బయటకు రాకూడదని హెచ్చరించారు.
వరదలో కొట్టుకుపోయి వ్యక్తి మృతి
హైదరాబాద్ – ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్లోని బాప్టిస్ట్ చర్చి వద్ద విజయ్ (43) అనే రోజువారి కూలీ మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి వరదలో కొట్టుకుపోయి మృతి
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు. pic.twitter.com/DBtqG4hQ6h
— Telugu Scribe (@TeluguScribe) August 20, 2024