Gandhi Hospital | హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌పై దాడి జరిగింది. ఎమర్జెన్సీ వార్డులో మహిళా జూనియర్ డాక్టర్‌పై రోగి సహాయకుడు దాడికి పాల్పడ్డాడు. అప్రాన్ లాగి, దాడి చేయడంతో అతడి బారి నుంచి ఇతర సిబ్బంది డాక్టర్‌ను కాపాడారు. డాక్టర్‌పై దాడికి పాల్పడిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు గాంధీ ఆస్పత్రికి చేరుకుని, దాడికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని చిలకలగూడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. జూనియర్ డాక్టర్లు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
సీసీ ఫుటేజ్.. గాంధీ ఆస్పత్రిలో మహిళా డాక్టర్ పై దాడి
సికింద్రాబాద్ – గాంధీ ఆస్పత్రిలో ఓ లేడీ జూనియర్ డాక్టర్ పై దాడి కలకలం రేపింది.. మహిళా డాక్టర్ చేయి పట్టుకుని ఆమె అప్రాన్ లాగి రోగి బంధువు ఇబ్బంది పెట్టాడు.
అప్రమత్తమైన వైద్య సిబ్బంది డాక్టర్‌ను రక్షించారు. అనంతరం పోలీసులకు… pic.twitter.com/hqpfWsgZHa
— Telugu Scribe (@TeluguScribe) September 11, 2024
ఇవి కూడా చదవండి..
TG TET | టెట్ మార్కుల ఎడిట్‌కు రేపు, ఎల్లుండి అవకాశం.. 13 తర్వాత సవరణకు వీల్లేదు
TGSRTC | బస్సులో విద్యార్థికి గుండెనొప్పి.. ప్రాణాలు కాపాడిన సిబ్బందిని అభినందించిన సజ్జనార్
Harish Rao | పసికందును పీక్కుతిన్న కుక్కలు.. మనసు కలిచివేసిందన్న హరీశ్‌రావు