మారేడ్‌పల్లి, సెప్టెంబర్ 16 : పట్టాలు దాటుతుండగా ఓ వ్యక్తిని రైలు(Train) ఢీ కొట్టడడంతో అక్కడిక్కడే మృతి (Man died )చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీ సులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్ రాష్ర్టానికి చెందిన అస్లాం (36) జీవనోపాధి నిమిత్తం నగరం లోని చర్లపల్లి(Charlapally) ప్రాంతంలో నివాసం ఉంటూ స్థానికంగా ఓ చికెన్ సెంటర్లో హెల్పర్‌గా పని చేస్తున్నాడు.
అస్లాం రాత్రి తన పని ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమంలో చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండ గా రైలు ఢీ కొట్టడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చూరీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Maneru Dam | నిండు కుండలా మానేరు డ్యాం.. రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
KTR | మోదీ జీ.. 4 నెలలైనా ఆర్ఆర్ ట్యాక్స్‌పై చర్యలు తీసుకోలేదు ఎందుకు: కేటీఆర్
KTR | తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట.. రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతారా: కేటీఆర్