Kidnap | హైదరాబాద్ : హైదరాబాద్ నీలోఫర్‌లో కిడ్నాప్ అయిన శిశువు కర్నూల్లో ప్రత్యక్షమైంది. ఈ కేసును పోలీసులు కేవలం ఆరు గంటల్లోనే చేధించారు. కిడ్నాప్ చేసిన మహిళతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ శిశువుతో పాటు మరో శిశువు కూడా వారితో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులను కర్నూల్ నుంచి హైదరాబాద్‌కు తరలించారు.
జహీరాబాద్‌కు చెందిన హసీనా బేగం, గఫార్ దంపతులకు చెందిన నెలరోజుల పసికందు అనారోగ్యం బారిన పడటంతో అక్టోబర్ 29వ తేదీన నీలోఫర్ దవాఖానలో అడ్మిట్ చేశారు. కాగా, చికిత్స పొంది, కోలుకున్న పసికందును శనివారం దవాఖాన వైద్యులు డిశ్చార్జి చేశారు. అనంతరం దవాఖాన పాత భవనంలోని ఆరోగ్యశ్రీ కౌంటర్ వద్ద రవాణా ఖర్చులు తీసుకుని ఫొటో దిగుతుండగా.. పక్కనే ఉన్న గుర్తుతెలియని మహిళ వచ్చి చిన్నారిని తనకు ఇచ్చి ఫొటో దిగాలని చిన్నారి తల్లి హసీనాబేగంకు సూచించింది. ఆమె మాటలు నమ్మిన హసీనాబేగం చిన్నారిని గుర్తుతెలియని మహిళకు ఇచ్చి ఫొటో దిగి, తిరిగి చూసేసరికి సదరు మహిళ అక్కడ కనిపించలేదు.
దీంతో దవాఖాన మొత్తం కలియతిరిగినా ఆ చిన్నారిని ఎత్తుకెళ్లిన మహిళ కనిపించలేదు. చేసేదిలేక తన బిడ్డ ఆచూకీ తెలుపాలని బోరున విలపిస్తూ హసీనాబేగం దవాఖాన సూపరింటెండెంట్‌తోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, సీసీటీవీ ఫుటేజీ సహాయంతో ఆరు గంటల్లోనే బిడ్డ ఆచూకీ కనుగొన్నారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసులపై దాడి
Kokapet Lands | కోకాపేట్ భూములను ఏం చేద్దాం? మిగులు 24 ఎకరాలపై తర్జన భర్జన?
HYDRAA | అప్పుడు వద్దన్నా కూల్చేశారు.. ఇప్పుడు కూల్చేదే లేదంటున్నారు.. మేమేం పాపం చేశాం!