Tania | సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ‘సే ఎస్ టూ లైఫ్ – సే నో టూ డ్రగ్స్’ అంటూ తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో(టీఎస్‌న్యాబ్) నిర్వహిస్తున్న డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో రెండో రోజు వివిధ కాలేజీల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు టీఎస్ న్యాబ్ ఆధ్వర్యంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రెండో రోజు ఆదివారం హైదరాబాద్, సెంట్రల్ యూనివర్శిటీ, జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు కలిసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్యాంపస్ గోడపై ఆకర్షణీయంగా చిత్రాలు తీర్చిదిద్దారు. మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల శరీర భాగాలు ఎలా దెబ్బతింటాయనే విషయాన్ని చిత్రాల ద్వారా చూపించి అందరినీ ఆకట్టుకున్నారు. విద్యార్థుల చిత్రాలను చూసిన నగర పోలీస్ కమిషనర్, టీన్యాబ్ డైరెక్టర్ సీవీ ఆనంద్, డీడబ్ల్యూసీడీఎస్ డైరెక్టర్ శైలజ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ సీతారామారావు విద్యార్థులను అభినందించారు.
డ్రగ్స్ రహిత రాష్ట్రం..
జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినంగా నిర్వహిస్తున్నామని సీవీ ఆనంద్ తెలిపారు. ఈ సందర్భంగా రెండో రోజు యూనివర్సిటీ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం కోసం దేశంలోనే మొదటి సారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ యాంటీ నార్కొటిక్ బ్యూరోను ఏర్పాటు చేశారన్నారు. ఒక్క గ్రాము డ్రగ్ కూడా రాష్ట్రంలోకి రాకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇటీవల డ్రగ్ కేసులలో అమ్మకం, కొనుగోలు, రవాణాదారులను అరెస్ట్ చేశామన్నారు. తమకు పట్టుబడుతున్న వారిలో యువతులు కూడా ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 9, 10వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అద్భుతమైన ఇమేజరి క్లిష్టమైన డిజైన్ల ద్వారా విద్యార్థులు మాదక ద్రవ్యాల దుర్వినియోగం, వాటి ప్రమాదాలను వివరించే శక్తివంతమైన గ్రాఫిటీ డోడను సృష్టించారని సీవీ ఆనంద్ అన్నారు. డిజబులిటీ డిపార్టుమెంట్ డైరెక్టర్ శైలజ మాట్లాడుతూ తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం కోసం ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తున్నదన్నారు. వీసీ సీతారామారావు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీపీ సీవీ ఆనంద్ ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో టీఎస్‌న్యాబ్ ఎస్పీలు సునీతా, చక్రవర్తి గుమ్మిలు పాల్గొన్నారు.
‘సే ఎస్ టూ లైఫ్ – సే నో టూ డ్రగ్స్’ అంటూ తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో(టీఎస్‌న్యాబ్) నిర్వహిస్తున్న డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో రెండో రోజు వివిధ కాలేజీల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు టీఎస్ న్యాబ్ ఆధ్వర్యంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రెండో రోజు ఆదివారం హైదరాబాద్, సెంట్రల్ యూనివర్శిటీ, జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు కలిసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్యాంపస్ గోడపై ఆకర్షణీయంగా చిత్రాలు తీర్చిదిద్దారు. మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల శరీర భాగాలు ఎలా దెబ్బతింటాయనే విషయాన్ని చిత్రాల ద్వారా చూపించి అందరినీ ఆకట్టుకున్నారు. విద్యార్థుల చిత్రాలను చూసిన నగర పోలీస్ కమిషనర్, టీన్యాబ్ డైరెక్టర్ సీవీ ఆనంద్, డీడబ్ల్యూసీడీఎస్ డైరెక్టర్ శైలజ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ సీతారామారావు విద్యార్థులను అభినందించారు.
డ్రగ్స్ రహిత రాష్ట్రం..
జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినంగా నిర్వహిస్తున్నామని సీవీ ఆనంద్ తెలిపారు. ఈ సందర్భంగా రెండో రోజు యూనివర్సిటీ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం కోసం దేశంలోనే మొదటి సారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ యాంటీ నార్కొటిక్ బ్యూరోను ఏర్పాటు చేశారన్నారు. ఒక్క గ్రాము డ్రగ్ కూడా రాష్ట్రంలోకి రాకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇటీవల డ్రగ్ కేసులలో అమ్మకం, కొనుగోలు, రవాణాదారులను అరెస్ట్ చేశామన్నారు. తమకు పట్టుబడుతున్న వారిలో యువతులు కూడా ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 9, 10వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అద్భుతమైన ఇమేజరి క్లిష్టమైన డిజైన్ల ద్వారా విద్యార్థులు మాదక ద్రవ్యాల దుర్వినియోగం, వాటి ప్రమాదాలను వివరించే శక్తివంతమైన గ్రాఫిటీ డోడను సృష్టించారని సీవీ ఆనంద్ అన్నారు. డిజబులిటీ డిపార్టుమెంట్ డైరెక్టర్ శైలజ మాట్లాడుతూ తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం కోసం ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తున్నదన్నారు. వీసీ సీతారామారావు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీపీ సీవీ ఆనంద్ ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో టీఎస్‌న్యాబ్ ఎస్పీలు సునీతా, చక్రవర్తి గుమ్మిలు పాల్గొన్నారు.
చిన్న వయసులోనే నగరానికి చెందిన 12 ఏండ్ల బాలిక తానియా పెద్ద చాలెంజ్ చేపట్టింది. మత్తు పదార్థాలు, మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తన గొంతుతోపాటు కలాన్ని సైతం ఎక్కుపెడుతున్నది. ఏకంగా దేశ ప్రధానికి, రాష్ట్రపతికి ఉత్తరాలను రాసింది. ఆమె కృషికి గాను 2017లో అంతర్జాతీయ డ్రగ్ ఫ్రీ సంస్థ తానియాను భారత్ నుంచి జూనియర్ అంబాసిడర్‌గా నియమించింది. అంతేకాదు యూత్ ఫర్ హ్యూమన్‌రైట్స్ ఇంటర్నేషనల్ సంస్థకు జూనియర్ మెంబర్‌గా కొనసాగుతున్నది. ప్రస్తుతం ఈ విద్యార్థిని అంబర్‌పేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నది. సేవల్లోనే కాదు చదువులోనూ చురుకుగా ఉందని ఆమె తండ్రి షేక్ సలావుద్దీన్ తెలిపారు. అంతేకాదు ఇటీవలె తన కిడ్డీ బ్యాంక్‌లోని రూ.33వేలు తీసుకొని పేద డ్రైవర్లకు నిత్యావసర సరుకులను తండ్రితో కలిసి పంపిణీ చేసింది.