ఇంటింటికీ జెండాలు
- స్వయంగా అందజేసిన మంత్రులు
- విద్యార్థుల కోసం ‘గాంధీ’ సినిమా
- వేడుకల పై మంత్రుల సమీక్షలు
- అట్టహాసంగా 75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 9: స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రజల్లో స్వాతంత్య్ర స్ఫూర్తి రగిలించడంతోపాటు జెండా ప్రాముఖ్యతను తెలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మువ్వన్నెల జెండాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా మొదలైంది.
మంగళవారం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి స్వయంగా ఇంటింటికీ వెళ్లి జాతీయ పతాకాలను అందజేశారు. దేశ దాస్య శృంఖలాలు తెంపిన స్వాతంత్య్ర సమరయోధులు, జాతినేతల గురించి భావితరాలకు తెలియజేసేందుకు మహాత్మా గాంధీ సినిమాను విద్యార్థుల కోసం ప్రదర్శింపజేశారు.
ఆయా జిల్లాల్లో మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జీ జగదీశ్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, చామకూర మల్లారెడ్డి, సబితాఇంద్రారెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

