ప్రశాంత్‌నగర్‌లో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో బుధవారం గ్రీన్ చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా కూకట్పల్లి డిపోకు చెందిన 60 నూతన ఎలక్ట్రిక్ బస్సులను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌లతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం మేడ్చల్ కలక్టర్ మనూ చౌదరి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌లతో కలిసి బస్సులో ప్రయాణించారు. కేవలం ఒక్క హైదరాబాద్ నగరంలోనే 540 ఎలక్ట్రిక్ బసులలు నడుస్తుండగా, రాష్ట్ర వ్యాప్తంగా 1050 ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ కలక్టర్ మనూ చౌదరి, తదితరులు పాల్గొన్నారు. -బాలానగర్, మే 27