కేపీహెచ్‌బీ కాలనీ: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. హైదర్‌నగర్ డివిజన్ లోని రామ్ నరేశ్ నగర్ కాలనీ మాజీ అధ్యక్షుడు వెంకటేశ్ యాదవ్ ఆధ్వర్యంలో 50 మంది కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరారు. ఆదివారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు.
పచ్చిఅబద్ధాలతో పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని… నేటికీ తులం బంగారం ఊసే లేదని విమర్శించారు. అబద్ధపు హామీలతో సర్కారు ను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారన్నారు.