Hyderabad | హైదరాబాద్ : గుడి మల్కాపూర్ పీఎస్ పరిధిలో దోపిడీ జరిగింది. తిబర్మల్ జ్యువెలర్స్ మేనేజర్ నుంచి డబ్బుల బ్యాగును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. రూ. 35 లక్షల బ్యాగును అపహరించినట్లు బాధిత మేనేజర్ తెలిపారు. ఈ ఘటన రేతిబౌలి ఎక్స్ రోడ్డులోని పిల్లర్ నంబర్ 28 వద్ద శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తిబర్మల్ జ్యువెలర్ షాపు యజమాని శ్రీకాంత్.. బంజారాహిల్స్‌లోని బంగారం దుకాణం నుంచి అత్తాపూర్ వైపు వెళ్తుండగా పాన్ కొనేందుకు రేతిబౌలి ఎక్స్ రోడ్డు వద్ద ఆగాడు. అయితే శ్రీకాంత్ చేతిలో ఉన్న బ్యాగును దుండగులు లాక్కొని పారిపోయారు. ఇద్దరు దుండగులు కూడా పల్సర్ బైక్ పై వచ్చినట్లు శ్రీకాంత్ తెలిపారు. ఆ ఇద్దరు కూడా హెల్మెట్ ధరించి ఉన్నారని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | హైదరాబాద్ పబ్బులపై అధికారుల దాడులు.. ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్
HYDRAA | గగన్‌పహాడ్‌లో హైడ్రా.. అప్ప చెరువులో నిర్మాణాల కూల్చివేత
Hyderabad | పోలీసుల నిర్లక్ష్యంతో సిటీలోకి భారీ వాహనాలు.. ఛిద్రమవుతున్న విద్యా కుసుమాలు