సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీసులు శనివారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ తనిఖీల్లో 329మంది మందుబాబులు పట్టుపడ్డారు. పట్టుబడిన వాహనదారుల్లో 248 మంది ద్విచక్రవాహనదారులు, 23 మంది త్రి చక్రవాహనదారులు, 54మంది నాలుగు చక్రాల వాహనదారులు, నలుగురు భారీ వాహనదారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో బీఏసీ రేంజింగ్ 35ఎంజీ/100ఎంఎల్ నుంచి 200ఎంజీ/100ఎంఎల్ మధ్యన 283మందికి, 200ఎంజీ/100ఎంఎల్ నుంచి 300ఎంజీ/100ఎంఎల్ మధ్య 37మందికి, 301ఎంజీ/100ఎంఎల్ నుంచి 500ఎంజీ/100ఎంఎల్ మధ్య 9మందికి బీఏసీ రేంజ్ ఉన్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
పట్టుబడిన నిందితులందరినీ న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా మద్యం మత్తులో వాహనాలు నడపడం తీవ్రమైన నేరమని, ఈ చర్య వల్ల రోడ్డు ప్రమాదాలతో పాటు ఇతరుల మరణానికి కారణమైతే భారతీయ న్యాయ సన్హిత చట్టం 2023, సెక్షన్ 105ప్రకారం హత్యా నేరం కేసు నమోదు చేయడంతో పాటు 10ఏళ్ళ వరకు జైలు శిక్ష పడే అవకాశమున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు.