హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని బస్తీల్లో నివసించే నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. ఈ చర్యల్లో భాగంగానే నగరంలోని పలు బస్తీల్లో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 226 బస్తీ దవాఖానాలు అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడుగా మరో 32 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొత్త వాటితో బస్తీ దవాఖానాల సంఖ్య 258కి చేరుకోనుంది. మొత్తం 300 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు బల్దియా నిర్ణయించింది. ప్రస్తుతం బస్తీ దవాఖానాల్లో 60 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు.