హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు (Jubilee Hills Results) కొనసాగుతున్నది. రెండు రౌండ్లు పూర్తయి, మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. మూడో రౌండ్లో వెంగళరావునగర్, సోమాజిగూడ ఓట్లు లెక్కిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంగా, బీజేపీ డిపాజిట్ దక్కించుకోవడమే కష్టంగా కనిపిస్తున్నది. రెండు రౌండ్లలో కలిపి ఆ పార్టీకి 307 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
కాగా, మొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు 8926 ఓట్లు రాగా, బీఆర్ఎస్ క్యాండిడేట్ మాగంటి సునీతకు 8864 ఓట్లు వచ్చాయి.
దీంతో మొదటి రౌండ్లో 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ నిలిచింది. ఇక రెండో రౌండ్లో కాంగ్రెస్కు 9691 ఓట్లు, బీఆర్ఎస్కు 8600 ఓట్లు పోలయ్యాయి. దీంతో అధికార పార్టీ అభ్యర్థి 1142 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.