Ganja | శామీర్ పేట్, ఏప్రిల్ 6 : ఇతర ప్రాంతాల నుండి నగరానికి భారీ మొత్తంలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి తరలిస్తున్నారని పక్క సమాచారం అందడంతో రంగంలోకి దిగిన ఎస్వోటి, శామీర్పేట్ పోలీసులు శామీర్పేట్ ఓఆర్ఆర్ వద్ద ఆదివారం తెల్లవారు జామున సుమారు 300 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గంజాయితో పాటు తరలిస్తున్నవారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. పూర్తి వివరాలను సాయంత్రం ప్రెస్ మీట్లో వెల్లడించనున్నట్లు సీఐ శ్రీనాథ్ తెలిపారు.