హైదరాబాద్ శివారులో రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుర్కపల్లి సమీపంలోని మురహరిపల్లి వద్ద కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తు్న్న ఓ కారు డివైడర్ ఎక్కి.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్నది.
ఈ రోడ్డు ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.