సిటీబ్యూరో, జూన్ 2(నమస్తే తెలంగాణ): నాలాలు, చెరువుల ఆక్రమణలపై హైడ్రాకు ప్రజావాణిలో ఫిర్యాదు లు వచ్చాయి. సోమవారం బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి లో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి 23 ఫిర్యాదులు అందాయని హైడ్రా సిబ్బం ది తెలిపారు. తిరుమలగిరి భూదేవినగర్‌లోని సాయిదత్తాగార్డెన్స్లో కమ్యూనిటీహాల్ నిర్మాణానికి ఉద్దేశించిన 225 గజాల స్థలం కబ్జా అయ్యిందని స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
శేరిలింగంపల్లి మండలంలోని ఖానామెట్ గ్రామంలో 11జ20,11జ21 సర్వే నంబర్లలో గురుకుల ట్రస్ట్‌లో లేఔట్ వేశారని, ఇందులోని ప్లాట్లతో పాటు రహదారులు కూడా కబ్జాకు గురయ్యాయని తెలిపారు. బేగంపేటలోని చీకోటి గార్డెన్స్ ప్రాంతంలో నాలా కుంచించుకుపోవడంతో బృందావన్ అపార్ట్మెంట్లోకి వరదనీరు వచ్చి చేరుతోంది… వరదనీరు చేరకుండా చూడాలని అపార్ట్‌మెంట్‌వాసులు ఫిర్యాదులు చేశారు. కూకట్‌పల్లిలోని రంగధాముని చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణలతోపాటు ఈ చెరువు నుంచి ఐడీఎల్ చెరువుకు వెళ్లే నా లా కూడా కబ్జా జరిగిందని స్థానికులు ఫిర్యాదు చేశారు.
వెంటనే ఆక్రమణలను తొలగించి వరదనీరు సాఫీగా వెళ్ళే లా ఏర్పాట్లు చేయాలని కోరారు. హస్మత్‌పేట నాలా పికెట్ నాలాలు కుంచించుకపోవడంతో బేగంపేట పరిసరాల్లో పలు కాలనీలు వరదనీటిలో చిక్కుకుంటున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. సైదాబాద్ బాలాజీనగర్‌లో మురు గు, వద కాలువలు కబ్జాకు గురయ్యాయని బాలాజీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను హైడ్రా అడిషనల్ కమిషనర్ పాపయ్య స్వీకరించి పరిశీలించారు.