మంగళవారం 26 మే 2020
Hyderabad - May 23, 2020 , 03:21:50

కూకట్‌పల్లి జోనల్‌లో రూ.2.64 కోట్లతో పనులు

కూకట్‌పల్లి జోనల్‌లో రూ.2.64 కోట్లతో పనులు

99.79 కి.మీ  పనుల్లో 80 శాతం పూర్తి

కేపీహెచ్‌బీ కాలనీ: గతంలో మాదిరిగా కాకుండా పూడికతీత పనులు మరింత పారదర్శకంగా ఉండేలా నిబంధనలను కఠినతరం చేసి కాంట్రాక్టర్‌కు అప్పగిస్తున్నారు.  నెలాఖరులోగా పనులను పూర్తి చేయడంతో పాటు వర్షాకాలం విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా కూకట్‌పల్లి జోన్‌ ఇంజినీరింగ్‌ అధికారులు సన్నద్ధమవుతున్నారు. జోన్‌ పరిధిలోని మూసాపేట, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, గాజులరామారం, అల్వాల్‌ సర్కిళ్ల పరిధిలో ప్రధాన కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలన్నింటినీ తొలగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వర్షాకాలంలో విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అత్యవసర బృందాలను సిద్ధం చేస్తున్నారు.   

జోన్‌లో రూ.2.64 కోట్లతో పూడికతీత పనులు..

ఐదు సర్కిళ్లలో రూ.2.64 కోట్లతో.. 99.79 కి.మీల దూరం నాలాల్లో పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. జోన్‌లో 46 పనులకు గాను 19 పనులు యంత్రాల సహాయంతో, 27 పనులు కూలీలతో చేపట్టారు.  

డిసెంబర్‌ వరకు కాంట్రాక్టర్‌దే బాధ్యత

నాలాల్లో పూడికతీత పనులు 80 శాతం పూర్తయ్యాయి. నెలాఖరులోగా మిగిలిన పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. పూడికతీత పనులు గతంలో మాదిరిగా కాకుండా పారదర్శకంగా నిబంధనలు ఉన్నాయి. పూడికతీసిన సదరు కాంట్రాక్టర్‌ డిసెంబర్‌ వరకు ఆ కాలువలో పడిన వ్యర్థాలన్నింటినీ తొలగించాల్సి ఉంటుంది.  - కె.శంకర్‌, ఎస్‌ఈ, కూకట్‌పల్లి జోన్‌ logo