బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 02, 2020 , 23:59:20

రక్తదానం

 రక్తదానం

  • ఎర్రగడ్డ: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆధ్వర్యంలో శనివారం షేక్‌పేటలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూ హ్య స్పందన లభించింది. ముఖ్యఅతిథిగా హాజరైన హోంమంత్రి మహమూద్‌ అలీ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ రక్తదానం ప్రాణదానంతో సమానమని పేర్కొన్నారు. 
  • ఓల్డ్‌బోయిన్‌పల్లిలో తెలంగాణ ఉద్యమనేత గణేశ్‌యాదవ్‌ సంవత్సరికం సందర్భంగా భాగ్యశ్రీగార్డెన్‌లో రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే మాధవ రం కృష్ణారావు ప్రారంభించారు. 
  • కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో తలసేమియా వ్యాధిగ్రస్తులు, పిల్లల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల పిలుపు మేరకు టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్‌ యాదవ్‌ స్పందించి,  100 మంది స్నేహితులు, కార్యకర్తలతో కలిసి కిమ్స్‌ దవాఖానలో రక్తదానం చేయించారు. ఇందుకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శనివారం ఆయనను అభినందించి, రక్తదాత సర్టిఫికెట్‌ను అందజేశారు.
  • అల్వాల్‌: లోతుకుంట లక్ష్మీకళామందిర్‌లో టీం సాయి పెండమిక్‌ టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సుమారు ఐదు వందల మంది సభ్యు లు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ముఖ్య అతిథులుగా నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌, గ్రేటర్‌ బీజే పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాంచంద్రారావు, బాలానగర్‌ డీసీపీ పద్మజ హాజరయ్యారు.  
  • బండ్లగూడ: బండ్లగూడ జాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని గంధంగూడ ఇండస్‌వ్యాలీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరంలో 40మంది యువకులు రక్త దానం చేశారు. కార్యక్రమానికి మేయర్‌ మహేందర్‌గౌడ్‌ హాజరై యువకులను అభినందించారు. 
  • చైతన్యపురి డివిజన్‌ పరిధిలో డివిజన్‌ కార్పొరేటర్‌ జిన్నారం విఠల్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం లయన్స్‌ క్లబ్‌ బ్లడ్‌ బ్యాంకు సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 80 మంది యువకులు రక్తదానం చేశారు. 
  • దుండిగల్‌: మంత్రి కేటీఆర్‌ పిలుపుమేరకు ఆదివారం కొలన్‌ రాఘవరెడ్డి గార్డెన్‌లో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ కొలన్‌ నీలాగోపాల్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి తెలిపారు.


logo