శనివారం 30 మే 2020
Hyderabad - Apr 30, 2020 , 23:43:14

ఐకియా కూడలికి కొత్తందాలు

ఐకియా కూడలికి కొత్తందాలు

ఐటీ కారిడార్‌లో కీలక ప్రాంతంగా పేరొందిన ఐకియా జంక్షన్‌ సరికొత్తగా ముస్తాబవుతున్నది. హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ  ఈ కూడలిని సుందరంగా తీర్చిదిద్దుతున్నది. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న వివిధ ఆకృతులు ఆకట్టుకుంటున్నాయి.  చిలుకూరు నుంచి తీసుకొచ్చిన 800 ఏండ్ల నాటి ఓ వృక్షాన్ని సైతం ఇక్కడ ట్రాన్స్‌లోకేషన్‌ చేశారు. ఈ బ్యూటిఫికేషన్‌ పనులను గురువారం హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ పరిశీలించారు. మరో వారం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, సుందరీకరణ పనులపై సంతోషం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా అర్వింద్‌కుమార్‌ను అభినందించారు. 

- సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ 


logo