కరోనా విజృంభణ.. యాదాద్రిలో ఆర్జిత సేవలు నిలిపివేత
కరోనా విజృంభణ | కరోనా విజృంభణ నేపథ్యంలో యాదాద్రి పుణ్యక్షేత్రంలో తాత్కాలికంగా ఆర్జిత సేవలను నిలిపివేశారు. రేపట్నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు

యాదాద్రి భువనగిరి : కరోనా విజృంభణ నేపథ్యంలో యాదాద్రి పుణ్యక్షేత్రంలో తాత్కాలికంగా ఆర్జిత సేవలను నిలిపివేశారు. రేపట్నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఆర్జిత సేవలు, అన్నప్రసాదం నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
73 మందికి కరోనా
భక్తులు లేకుండానే ఏకాంతంగా దైవారాధనలు నిర్వహించనున్నారు. లఘు దర్శనానికి మాత్రమే భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది కరోనా బారిన పడటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు యాదాద్రిలో 73 మంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు.
తెలంగాణలో కొత్తగా 463 కేసులు
గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 463 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,205కు పెరిగాయి. కొత్తగా 364 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 3,00,83 మంది కోలుకున్నారు. మరో నలుగురు వైరస్ ప్రభావంతో మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 1,694కు పెరిగింది.
రాష్ట్రంలో మరణాల రేటు 0.55 శాతం, రికవరీ రేటు 97.92శాతం ఉందని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,678 యాక్టివ్ కేసులు ఉండగా.. 1,723 హోం ఐసోలేషన్‌లో ఉన్నారని ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న ఒకే రోజు 42,461 కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీలో 145, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 46, రంగారెడ్డిలో 28, నిజామాబాద్‌లో 23, జగిత్యాలలో 20, వరంగల్ అర్బన్‌లో 19 అత్యధికంగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.
ఇవి కూడా చదవండి..
ఎర్రటి ఎండలో గర్భిణి 3 కి.మీ. నడక.. ఎస్ఐ సస్పెండ్
ఆ ఆరు రాష్ట్రాల్లోనే అధికంగా కొత్త కేసులు: కేంద్రం
నాగార్జున సాగర్‌లో బీజేపీ చతికిల!
బీజేపీ నాయకుడు ఆత్మహత్య
పగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు..
నిప్పులకుంపటి.. రాష్ట్రంలో 43 డిగ్రీలకు చేరిన ఎండ
హోలీ ఆడనివ్వలేదని అవ్వను చంపేశారు
ఆధార్ లింక్ లేకపోతే పాన్‌కార్డు చెల్లదు!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

