బుధవారం 08 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 05, 2020 , 00:44:12

క్రీడలతో మానసికోల్లాసం: సీపీ సజ్జనార్‌

క్రీడలతో మానసికోల్లాసం: సీపీ సజ్జనార్‌

శేరిలింగంపల్లి: క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ అన్నారు. బుధవారం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని పోలీస్‌ పరేడ్‌ గ్రాండ్‌లో నిర్వహిస్తున్న వార్షిక క్రీడోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. పలు జోన్‌లకు చెందిన పోలీస్‌ క్రీడాకారుల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు.అనంతరం బెలూన్లను ఎగురవేసి క్రీడోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బందిలో దాగిఉన్న ప్రతిభాపాటవాలు వెలికితీసేందుకు వార్షిక క్రీడోత్సవాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు.అనంతరం మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు పలు క్రీడాంశాల్లో నిర్వహిస్తామన్నారు. శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, బాలానగర్‌ డీసీపీ పద్మజా, ట్రైనీ ఐపీఎస్‌ రితీరాజ్‌, ఉమెన్‌ అండ్‌ చిల్డ్రన్‌ సెఫ్టీ విభాగం డీసీపీ అనసూయలతో పాటు పలువురు అడిషనల్‌ డీసీపీలు, ఏసీపీలు,పోలీసు అధికారులు, సిబ్బంది ఈ క్రీడోత్సవాల్లో పాల్గొన్నారు.


logo