ACB Raids | ఆర్అండ్బీ (రోడ్లు భవనాల శాఖ) ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్) మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టారని తెలిసిందే. మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మియాపూర్ పరిసర ప్రాంతాల్లోని 11 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించిన ఏసీబీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు, నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.
కాగా ఈ తనిఖీల్లో మోహన్‌నాయక్‌కు రూ.200 కోట్ల ఆస్తులు గుర్తించారు. మోహన్‌నాయక్ ఇంట్లో రూ.60 లక్షల నగదుతో పాటు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు గుర్తించారు. మోహన్‌నాయక్‌కు హైదరాబాద్‌లో పలు ప్లాట్లు, నిజామాబాద్‌లో వ్యవసాయ భూమి, అత్యంత ఖరీదైన విల్లాతో, అపార్ట్మెంట్, ఖాళీ స్థలాలు, ఫామ్ హౌజ్‌లు, విల్లాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన టెండర్లలో కాంట్రాక్టర్లకు టెండర్లు కేటాయించే ప్రక్రియలో అక్రమాలు చేసినట్టుగా మోహన్ నాయక్‌పై గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది.
Dubai | దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన ముగ్గురు కార్మికులు మృతి
Ramchander Rao | ప్రాజెక్టులు సీఎం రేవంత్‌రెడ్డికి ఏటీఎంలుగా మారాయి : రాంచందర్ రావు